దర్శకుడు అజయ్ భూపతి తన మొదటి సినిమా 'RX 100' తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా ఇప్పుడు, గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మంగళవరం' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీప్రేమికులని బాగా ఆకట్టుకుంది.
తాజాగా ఇప్పుడు, దర్శకుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు వెల్లడించాడు. ప్రొడక్షన్ పార్ట్ పూర్తి చేయడానికి మూవీ టీమ్‌కి 99 రోజులు పట్టింది అని ఒక చిన్న మేకింగ్ వీడియోని విడుదల చేసారు. విలేజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి కాంతారావు ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ పతాకాలపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.