తన జీవితంలో రాజకీయాలకి చోటు లేదని స్పష్టం చేశాడు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్. తాజాగా ఆయన నటించిన 'సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై సినిమా విడులైంది.చిత్ర ప్రచారంలో భాగంగా ఆయన తన సొంతరాష్ట్రమైన బీహార్‌లోని పాట్నాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులు రాజకీయాల్లోకి వస్తున్నారా అని ప్రశ్నించడంతో ఆయన పై విధంగా స్పందించారు. నటుడిగానే కొనసాగుతా..రాజకీయాల్లోకి రానని మనోజ్ బాజ్‌పాయ్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
200 శాతం ఆ పని చేయబోనని స్పష్టం చేశారు. ఆ ప్రశ్నే తలెత్తదని వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్‌లో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. అయితే అప్పటి నుంచి తాను రాజకీయాల్లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నదని వెల్లడించారు.