టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా 'RAPO 20' పేరుతో అధికారికంగా ప్రారంభించబడింది. రీసెంట్గా చిత్రీకరణ కోసం మూవీ టీమ్ మైసూర్ వెళ్లింది. తాజా బజ్ ప్రకారం, ఈ మాస్ యాక్షన్ సినిమా యొక్క మైసూర్ షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా తన ఫేస్బుక్ పేజీ ద్వారా తెలియజేశాడు.
ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 20, 2023న బహుళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమా ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.