సంతోష్ శోభన్-మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్ని మంచిశకునములే’. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి హైప్ పెంచినప్పటికీ.. జనాలను థియేటర్లకు రప్పించలేకపోయింది. దీంతో మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 17న అమెజాన్ ప్రైమ్‌లో సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.