టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి తేజ్ 'విరూపాక్ష' విజయంతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ యొక్క సోషియో-ఫాంటసీ కామెడీ డ్రామా అయిన 'బ్రో' లో పవర్ స్టార్ తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సాయి తేజ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.
లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం, సంపత్ నంది ఈ సినిమా కోసం రెండు మాస్ టైటిల్స్ ని అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గోలీ శంకర్, గాంజా శంకర్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది అదే సమయంలో టైటిల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.