కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'VS 11' అని తాత్కాలికంగా పేరు పెట్టారు. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈరోజు నటి అంజలి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో అంజలి రత్నమాలగా కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ పరిచయం చేసారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.