టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరోసారి గీత గోవిందం దర్శకుడు పరశురాంతో కలిసి తన తదుపరి సినిమాని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. నటుడు-దర్శకుడి కొత్త ప్రాజెక్ట్ ఇటీవల లాంఛనంగా ప్రారంభించబడింది. ఈ సినిమాలో రావిషింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని లాక్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గీతా గోవిందం అందరినీ ఆకట్టుకుంది మరియు ముఖ్యంగా ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులలో విపరీతమైన ప్రేమను పొందింది. దీనిని బట్టి మూవీ మేకర్స్ మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూల్లో ముగించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండకు 13వ ప్రాజెక్ట్.