రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ విలేజ్ డ్రామాకి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా యొక్క 100 రోజుల ఈవెంట్లో రిషబ్ త్వరలో కాంతారా 2ని చేస్తానని, అంతేకాకుండా ఈ చిత్రం సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని కూడా స్పష్టం చేశాడు.
తాజాగా ఇప్పుడు , 27 ఆగస్టు 2023న ప్రారంభించబడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ కాంతారా 2ని నిర్మించనున్నారు.