ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పాన్-ఇండియన్ సినిమాలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి అతిధి పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అతని ఎంట్రీ సినిమాలోని సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమతం, మకరంద్ దేశ్పాండే, జిషు సేన్ గుప్తా ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. శ్రీచరణ్ పాకాల, జూలియన్ అమరు ఎస్ట్రాడా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎడ్ ఎంట్రయిన్మెంట్స్పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.