ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మహర్షి' సినిమా వాయిదా పడనుందా

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 17, 2019, 01:14 PM

మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే ఆ రోజుకి కూడా ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

ఈ సినిమాకి సంబంధించిన మిగతా సన్నివేశాలను చిత్రీకరించడానికి నెల రోజులకుపైగా సమయం పట్టొచ్చని అంటున్నారు. మహేశ్ బాబు 25వ సినిమా కావడం వలన .. మరింత శ్రద్ధ తీసుకుంటున్న కారణంగా ఇంకా ఎక్కువ సమయమే పట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలాగూ ఉంటాయి. అందువలన ఈ సినిమా విడుదల తేదీ మళ్లీ మారే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa