కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి ఆనంద్ ఎల్ రాయ్‌తో సినిమా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రోజు నటుడు తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించనున్న తన తదుపరి హిందీ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'తేరే ఇష్క్ మే' అనే టైటిల్ ని లాక్ చేసారు.
నటుడు-దర్శకుడి మొదటి చిత్రం రాంఝానా తెరపైకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. అందుకే ఈ రోజు ప్రకటన వెలువడింది. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో ధనుష్ మోలోటోవ్ కాక్టెయిల్ని మోస్తున్న నిరసనకారుడిగా చూపబడింది. హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హిమాన్షు శర్మ నిర్మిస్తున్నారు.