మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘జీ కర్దా’. ఈ సినిమాలో తమన్నా ఓ రేంజ్లో రెచ్చిపోయింది. రొమాంటిక్ సీన్స్‌లో తమన్నా పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. బోల్డ్ సీన్లలో నటించడమే కాకుండా బూతు డైలాగులు చెప్పింది. ఈ విషయంపై తమన్నా స్పందిస్తూ.. ‘కథకు ఆ రొమాంటిక్ సీన్స్ అవసరం. జనాలకు నచ్చడం వల్లే అలాంటి సన్నివేశాల్లో నటించాను.’ అని చెప్పింది.