ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'స్పై'?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 22, 2023, 05:01 PM

ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


లేటెస్ట్ న్యూస్ ప్రకారం, ఈ పాన్-ఇండియన్ గూఢచర్య థ్రిల్లర్ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి U/A సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు.
 
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎడ్ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com