ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఈ పాన్-ఇండియన్ థ్రిల్లర్ సినిమా యొక్క టికెట్ ధరలు పెరిగాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్ గరిష్ట టిక్కెట్ ధర 295 మరియు సింగిల్ స్క్రీన్‌కి 175. ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్స్ ధర 177 మరియు సింగిల్ స్క్రీన్ కి 145. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఎడ్ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.