యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఆమె హాస్యనటుడు మరియు జాతీయ అవార్డు గ్రహీత తంబి రామయ్య కుమారుడు, తమిళ హీరో, ఉమాపతి రామయ్యతో ప్రేమలో ఉన్నట్లు లేటెస్ట్ టాక్. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారని 2024 ఫిబ్రవరిలో పెళ్లి జరగనుందని సమాచారం. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వర్క్ ఫ్రంట్లో, ఐశ్వర్య అర్జున్ త్వరలో ఒక తెలుగు చిత్రంలో కనిపించనుంది. ఆమె తండ్రి అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.