శాండల్‌వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ చివరిగా నటించిన 'కబ్జా' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఇప్పుడు, నటుడి తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 2023లో కిచ్చా సుదీప్ యొక్క 46వ చిత్రాన్ని వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైప్పులి ఎస్ థాను నిర్మించనున్నట్లు చేయనున్నట్లు ప్రకటించారు. ఈరోజు సినిమా గురించిన భారీ అప్డేట్ సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయబడుతుందని నిర్మాత వెల్లడించారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు విజయ్ కార్తికేయన్ డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మూవీ టీమ్ ఏమి రివీల్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.