ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పాన్ ఇండియన్ థ్రిల్లర్ సినిమా వరల్డ్ వైడ్ గా 17.50 కోట్ల రేంజ్ లో ప్రీ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఎడ్ ఎంట్రయిన్మెంట్స్పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.
'స్పై' ప్రీ రిలీజ్ బిజినెస్::::::
తెలుగు రాష్ట్రాల - 13.00 కోట్లు
KA + ROI - 0.70 కోట్లు
OS - 1.80 కోట్లు
ఇతర భాషలు - 2 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 17.50 కోట్లు