టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం కామెడీ మరియు యూత్ ఫుల్ సినిమాలను తీయడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ 'కీడా కోలా' అనే క్రైమ్ కామెడీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో రవీంద్ర విజయ్ CEOగా నటిస్తున్నట్లు అతని క్యారెక్టర్ పోస్టర్ ని రివీల్ చేసారు. జూన్ 28న ఈ సినిమా టీజర్ లాంచ్ కానుంది.
ఈ సినిమాలో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, దర్శకుడు తరుణ్ భాస్కర్, చైతన్యరావు కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 2023లో ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.