2023లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచి నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.
శాకుంతలం : సమంత నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్‌గా మారింది. దర్శకుడిగా గుణశేఖర్, నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని భావించారు కానీ ఈ పౌరాణిక నాటకం డిజాస్టర్‌గా మారింది.
కస్టడీ : భారీ అంచనాలతో విడుదలైన ఈ ద్విభాషా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. దాదాపు 25 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమా కేవలం 7 కోట్ల రూపాయలను వసూలు చేసి డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది.
రావణాసుర: సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించిన రావణాసుర రివెంజ్ డ్రామాగా విడుదలైంది. ఈ సినిమా సినీ ప్రేమికులని ఆకట్టుకోవడంలో విఫలమైంది.
రామబాణం: లక్ష్యం, లౌక్యం చిత్రాల విజయం తర్వాత గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందింది. పదిహేను కోట్ల బడ్జెట్ తో తీసిన రామబాణం సినిమా 4 కోట్ల లోపే వసూళ్లు చేసింది.
ఏజెంట్: అఖిల్ అక్కినేని నటించిన ఈ సినిమా రొటీన్ కాన్సెప్ట్ కారణంగా మొదటి వారాంతంలోనే థియేటర్ల నుండి తొలగించారు.