సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీకి అధికారికంగా 'BRO' అనే పేరు పెట్టారు. ఈ ఫాంటసీ కామెడీ డ్రామాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తోంది. ఈ బిగ్గీ జూలై 28, 2023న ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపైకి రానుంది. ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ సితం యొక్క అధికారిక రీమేక్.
తాజాగా మూవీ మేకర్స్ ఈ రోజు ఈ సినిమా టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సినిమా టీజర్ పవన్ కళ్యాణ్ ని టైమ్ గాడ్ గా చూపించింది. టీజర్లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా మరియు ప్రధాన హైలైట్ గా ఉంది.
ఈ సినిమాలో కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి మరియు రాజా చెంబోలు కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.