ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన గూఢచర్య థ్రిల్లర్ 'స్పై' సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో జూన్ 29, 2033న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా విడుదలైన మొదటి రోజు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 11.7 కోట్లకు పైగా (6 కోట్ల షేర్) వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలంటే మరో 12 కోట్ల షేర్ రాబట్టాలి.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది. రానా, సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఎడ్ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |