టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి గీతాంజలి శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. నిర్మాత విశ్వప్రసాద్ మాతృమూర్తి గీతాంజలి శివైక్యం చెందారని తెలిసి చింతిస్తున్నా. గీతాంజలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా' అని పేర్కొన్నారు.