బాలీవుడ్ ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ 2022లో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తిరిగి వారు కలిసి కనిపించారు. శనివారం ఢిల్లీలో జరిగిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఈవెంట్లో ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ తిరిగి కలిసిపోయారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.