టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘జులాయి’ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నించినా సౌత్ లో వచ్చినంత ఆదరణ లభించలేదనే చెప్పాలి. అప్పుడెప్పుడో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి సీనియర్ హీరోలతో కలిసి కొన్ని సినిమాల్లో ఇలియానా నటించింది. అయితే తాజాగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇలియానా.. ప్రెగ్నన్సీ వార్తతో ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అయితే తల్లి కావడానికి కారణం ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. గతంలో ఇలియానా ఓ విదేశీయుడితో కొంతకాలం డేటింగ్‌లో ఉంది. ఆపై ఆమె అతనితో విడిపోయింది.
కానీ ఇప్పుడు ఆమె తన బేబీ బంప్ ఫోటోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం ఇలియానా వెల్లడించలేదు. అందులో కుక్కతో ఆడుకుంటున్న వ్యక్తి ముఖం కనిపించకుండా కిందకు దించారు. దీంతో ఆయన ఎవరనేది చర్చనీయాంశమైంది. తన ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ షేర్ అవుతున్నా.. ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ ఫోటోకు 'పప్పీ లవ్' అని క్యాప్షన్ పెట్టారు. ఆమె ప్రియుడు అందులో కుక్కను ముద్దుపెట్టుకుంటున్నాడు.