ఈరోజు గురుపూర్ణిమ సందర్భంగా హీరోయిన్ పూనమ్ కౌర్ తన ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఒక స్టోరీ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ అవుతోంది. అయితే ఆ స్టోరీ లో 'ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, టామ్, డిక్ అండ్ హారీ అని ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్దని, నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు, మీకు దారి చూపించేవారు గురువు అవుతారు' అని ఆమె రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.