ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడాకులు కావాలని దరఖాస్తు చేసిన కొణిదెల నిహారిక

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 04, 2023, 08:41 PM

మెగా బ్రదర్ నాగబాబు కూతురు అయన కొణిదెల నిహారికకు గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు అయిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో 2020లో డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం జరిగింది. అయితే వీరిద్దరూ మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో కొన్నాళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. రెండేళ్ల తర్వాత విభేదాల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి పరస్పర అంగీకారంతో విడాకుల తీసుకోబోతున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరు విడాకులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి నిహారికకు సంబంధించిన ఫోటోలను తొలగించాడు. దీంతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత నిహారిక కూడా చైతన్య ఫోటోలను డిలీట్ చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com