మలయాళ నటుడు-చిత్రనిర్మాత జూడ్ ఆంథనీ జోసెఫ్ తన ఇటీవలి చిత్రం '2018' తో చరిత్ర సృష్టించారు. వినాశకరమైన కేరళ వరదల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి 200 కోట్ల గ్రాసర్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈరోజు, దర్శకుడిగా జూడ్ తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని మూవీ టీమ్ సెలెక్ట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆగస్ట్‌లో లైకా ప్రొడక్షన్స్ సినిమా తారాగణం మరియు సిబ్బందికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తుందని లేటెస్ట్ టాక్.