మలయాళ నటుడు-చిత్రనిర్మాత జూడ్ ఆంథనీ జోసెఫ్ తన ఇటీవలి చిత్రం 2018 తో చరిత్ర సృష్టించారు. వినాశకరమైన కేరళ వరదల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి 200 కోట్ల గ్రాసర్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా దర్శకుడి తదుపరి చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా ఎంపిక చేయటానికి మూవీ మేకర్స్ చూస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.