భారత క్రికెటర్ ఎంఎస్ ధోని కోలీవుడ్‌లో ధోనీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో తన తొలి నిర్మాణాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. డైరెక్టర్ రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'LGM' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ లెట్స్ గెట్ మ్యారీడ్ (LGM) థియేట్రికల్ ట్రైలర్ ను చెన్నైలో గ్రాండ్ గా లాంచ్ చేసారు. వినోదం, భావోద్వేగాలతో ట్రైలర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ మరియు ఇవానా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నదియా,యోగి బాబు, మిర్చి విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామాకి దర్శకుడు రమేష్ తమిళమణి స్వయంగా సంగీతం అందిస్తున్నారు. ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు.