సాయి రాజేష్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'బేబీ' సినిమా జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6.05 కోట్ల ప్రీ బిజినెస్ చేసినట్లు సమాచారం.
లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన జోడిగా వైష్ణవి చైతన్య నటిస్తుంది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
'బేబీ' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::::
నైజాం - 2.25 కోట్లు
సీడెడ్ - 1 కోట్లు
ఆంధ్రప్రదేశ్ - 2.8 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ : 6.05 కోట్లు