సెన్సేషనల్ డైరెక్టర్ హరితో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన తదుపరి సినిమాని చేయనున్నట్టు ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రంలో విశాల్‌తో తిరు ఫేమ్ ప్రియా భవానీ శంకర్ రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఆన్లైన్ లో కొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ సౌండ్‌ట్రాక్‌లను అందించనున్నారు. విశాల్ తన రాబోయే చిత్రం మార్క్ ఆంటోని షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.