బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పోగొట్టుకున్నారు. ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని, మంచి లాభాలు వస్తాయంటూ ఓ సినీ నిర్మాత, మరో ఇద్దరు భాగస్వాములు వివేక్ ఒబెరాయ్ ను నమ్మించారు. దీంతో ఆయన రూ.1.55 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఆ సొమ్మును వారు సొంతానికి వాడుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులపై కేసు నమోదు చేశారు.