ట్రెండింగ్
Epaper    English    தமிழ்

118 మూవీ పై తాజా వార్త

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 24, 2019, 01:07 PM

నా నువ్వే తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘118’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో జరుగనుంది. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఎవరు వస్తారనే విషయం ఫై సమాచారం లేదు. కెవి గుహన్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో నివేత థామస్, శాలిని పాండే కథానాయికలుగా నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1 న విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa