తెలుగు బ్లాక్ బ్లాస్టర్ తెలుగు మూవీఅర్జున్ రెడ్డి హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ‘ఖబీర్ సింగ్’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది.
ఇక ఈ చిత్రాన్ని ఇటీవల పుల్వామా లో భారత సైనికుల ఫై జరిగిన టెర్రర్ అటాక్ కు నిరసనగా పాకిస్థాన్ లో విడుదలచేయడం లేదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన మురాద్ ఖైతాన్ తెలియజేశారు. ఈ సినిమా జూన్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa