తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ 7/G రెయిన్బో కాలనీ సినిమాతో ఒక మేజిక్ ని సృష్టించాడు. ఈ సినిమా తెలుగులో 7/G బృందావన్ కాలనీ అనే టైటిల్ తో విడుదలైంది. రవికృష్ణ మరియు సోనియా అగర్వాల్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం 2004లో విడుదలయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర యొక్క సీక్వెల్ ప్లాన్స్ జరగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా ఈ చిత్రాన్ని తెలుగులో రీ-రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 4K మరియు డాల్బీ అట్మాస్ పనులు వేగంగా జరుగుతుండగా రీ-రిలీజ్ విడుదల తేదీని మూవీ మేకర్స్ అతి త్వరలో ప్రకటించనున్నారు. ఈ కల్ట్ ఫిల్మ్ కి యువన్ శంకర్ రాజా అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.