అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హిడింభ' జులై 20, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆగస్ట్ 10న ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబటులోకి రానుంది.
ఈ సినిమా అశ్విన్ సరసన జోడిగా నందితా శ్వేత నటిస్తుంది. సుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. SVK సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బాదిసా సంగీతం అందించారు.