ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాహుబలి ప్రభాస్ 'సాహో' చిత్రం పై తాజా వార్త

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 26, 2019, 05:10 PM

బాహుబలి 2 తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 ను విడుదలచేయగా తాజాగా ఈచిత్రంలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా మార్చి 3 న షేడ్స్ అఫ్ సాహో చాఫ్టర్ 2 ను విడుదలచేయనున్నామని చిత్ర బృందం ఒక వీడియో ద్వారా అధికారంగా ప్రకటించింది.

‘రన్రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మురళి శర్మ , అరుణ్ విజయ్ ,వెన్నల కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 15న తెలుగు , హిందీ , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa