హర్యానాకు చెందిన ప్రముఖ సింగర్ రాజు పంజాబి (40) మంగళవారం మృతిచెందారు. హిసార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా కాలేయ సమస్యకు చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మరణించారు. రాజు పంజాబి చివరి సారిగా ఈనెల 12న ఆప్సే మిల్కే యారా హంకో అచ్చా లగా థా అనే సాంగ్‌ను విడుదల చేశారు. రాజు పంజాబి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం వ్యక్తం చేశారు.