మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్దార్థ్ చందేకర్. తాజాగా ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇటీవల తన తల్లికి రెండో వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫోటోలు షేర్ చేశారు. ‘అమ్మా హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.’ అంటూ ఉద్యేగభరితమైన పోస్ట్ రాసుకొచ్చారు.