మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…
అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా..
పరుగులు తీస్తావు ఇంటా బయట..
అలుపని రవ్వంతా అననే అనవంటా..
వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా..
సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..
సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స
గ..మ..ప..మ..గ.. గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స..
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…
నీ కాటుక కనులు విప్పారకపోతే.. ఈ భూమికి తెలవారదుగా..
నీ గాజుల చేయి కదలాడకపోతే.. ఏ మనుగడ కొనసాగదుగా…
ప్రతి వరుసలోను ప్రేమగా..
అల్లుకున్న బంధమా.. అంతులేని నీ శ్రమ అంచనాలకందునా
ఆలయాలు కోరనీ.. ఆదిశక్తి రూపమా..
నీవు లేని జగతిలో దీపమే వెలుగునా..
నీదగు లాలనలో, ప్రియమగు పాలనలో..
ప్రతి ఒక మగవాడు పసివాడేగా..
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా..
ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…