తమిళ హీరో శింబుకు భారీ షాక్ తగిలింది. ఆయనకు రూ.కోటి జరిమానాను తమిళనాడు హైకోర్టు బుధవారం విధించింది. దానిని 3 వారాల్లో చెల్లించాలని పేర్కొంది. కరోనా కుమార్ అనే సినిమాలో నటించేందుకు శింబుకు వేల్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మాత గణేష్ రూ.4.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చాయి. రూ.కోటి మాత్రమే ఇచ్చినట్లు ఒప్పంద పత్రంలో ఉంది. దీంతో దానిని తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.