ఆకట్టుకునే అందం నివేదా థామస్ సొంతం. గ్లామర్ రోల్స్‌కి దూరంగా ఉంటూనే తనదైన గెటప్స్‌తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ భామ చేసిన తాజా సినిమా ‘118’. కే. వీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటించారు. రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన నివేదా థామస్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
పదే పదే వచ్చే ఓ కలను ఫాలో అయ్యే హీరో కథే ఈ సినిమా అని, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పింది నివేద. ఒక అమ్మాయి తనకు సమస్య ఎదురైనప్పుడు ఏం చేస్తుందో ఈ సినిమాలో తన పాత్ర అదేనని తెలిపింది. చిత్రంలో చివరి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పిన నివేదా.. తన పాత్ర గురించి పూర్తిగా చెప్పనని, చిత్రంలో తన పాత్ర ఎంతో కీలకమైందని తెలిపింది. ఈ చిత్రం ద్వారా మొదటిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెపుకున్నానని తెలిపింది. చిత్ర ప్రీ- రిలీజ్ ఫంక్షన్‌లో ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడు తనను అభినందించడం చాలా ఆనందాన్నిచ్చిందని చెప్పుకొచ్చింది నివేదా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa