కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్‌ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రాజెక్టులో బాలాజీ అనే వ్యాపార భాగస్వామి నుంచి రూ.15.83 కోట్లు తీసుకున్నాడు. అయితే తన డబ్బు తిరిగి ఇవ్వాలని బాలాజీ కోరగా రవీందర్ నిరాకరించాడు. బాధితుడి ఫిర్యాదుతో రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఆయన సీరియల్ నటి మహాలక్ష్మిని కొన్నాళ్ల క్రితం వివాహమాడారు.