రకుల్ ప్రీత్ సింగ్.. హీరోయిన్గా నిలబడేందుకు స్ట్రగుల్ అవుతూనే ఉంది. తెలుగులో పదేళ్ల పాటు రాణించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).. సక్సెస్‌తో సంబంధం లేకుండా ఆఫర్లని దక్కించుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అందం, అభినయంతో మెప్పించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఓ రౌండ్ టాలీవుడ్‌ని ఊపేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్లో రచ్చ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో అనూహ్యంగా వరుసగా ఆఫర్లు దక్కించుకుని దూసుకుపోతుంది. అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన `దే దే ప్యార్ దే` సినిమాతో ఈ బ్యూటీ లైఫ్ మారిపోయింది. అక్కడ వరుసగా ఆఫర్లని దక్కించుకుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను రిలీజ్ చేస్తూ రెండేళ్లపాటు దుమ్ము రేపింది. కానీ ఇప్పుడు అక్కడ కూడా అవకాశాలు తగ్గాయి. సక్సెస్ లేకపోవడంతో ఎక్కడైనా ఫేడౌట్ కావాల్సిందే. సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. దీంతో రకుల్‌కి బాలీవుడ్లో విజయాలు దక్కలేదు. కేవలం గ్లామర్‌తోనే కెరీర్‌ని లాక్కురావడం కష్టం. దీంతో ఇప్పుడు రకుల్‌కి హిందీలో కూడా హార్డ్ డేస్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ టైట్ ఫిట్‌లో తనచుట్టుకొలతలు, తన షేపులు చూపిస్తుంది. ముఖ్యంగా బ్యాక్ అందం చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది రకుల్.
#RakulPreet #RakulPreetSingh pic.twitter.com/l7Vo9Yqsbr
— Only Heroines (@OnlyHeroines) September 9, 2023