సీనియర్ నటి మలైకా అరోరా తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. లెహంగా వోణీ వెలిగిపోతూ, బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా ఆకర్షణీయంగా కనిపించింది.బాలీవుడ్ ముదురు భామ మలైకా అరోరా ఎప్పుడూ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిస్తూ కనిపిస్తుంటుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ట్రెండీ లుక్స్ తో ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే అందాల విందుతోనూ మంత్రముగ్ధులను చేస్తుంటుంది. చాలా రోజుల తర్వాత మలైకా అరోరా ట్రెడిషనల్ వేర్ లో పద్ధతిగా మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో సీనియర్ నటి మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోలకూ ఫోజులిచ్చింది. ఇక తాజాగా ‘లోక్ మాతా అవార్డ్స్’, ‘వెడ్డింగ్ డైరీస్’ ఈవెంట్లలో పాల్గొంది. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయింది. ఈవెంట్ లో ర్యాంప్ వ్యాక్ చేసి అందరి చూపు తనపైనే పడేలా చేసింది. తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. లేటెస్ట్ లుక్స్ లో మలైకా అరోరా డిజైన్డ్ గ్రీన్ లెహంగా, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ వోణీలో దర్శనమిచ్చింది. ఆకర్షణీయమైన నెక్లెస్ కూడా ధరించి రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత మలైకా ఇంత పద్ధతిగా మెరియడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐదు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా ఈ ముద్దుగుమ్మ ఫిట్ గా ఉండటం పట్ల అభినందిస్తున్నారు. కామెంట్లతో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.
#MalaikaArora pic.twitter.com/mXeexZuD5V
— Cine kollywood (@CinekollyHD) September 15, 2023