శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. ఎం. ఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. వివేక్ రంగాచారి నిర్మించారు. ప్రముఖ నిర్మాత, శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రం విడుదల హక్కులను దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆయన గురువారం చెప్పారు. క్రికెట్ ప్రేమికులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న చిత్రమిదని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్, నరెన్, నాజర్ కీలకపాత్రలు పోషించారు.