నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానరుపై వచ్చిన ‘జైలర్’ చిత్రం మెగా బ్లాక్‌బస్టర్ సాధించింది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడంతో ఆ చిత్రం నిర్మాత కళానిధి మారన్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అదేసమయంలో ‘జైలర్’లో నటించిన నటీనటులతో టెక్నీషియన్లకు బహుమతులు ఇచ్చారు. హీరో రజనీకి కోటిన్నర రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూఎక్స్7 సిరీస్ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు. ఇదే విధంగా దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌కు కూడా లగ్జరీకార్లు ఇచ్చారు. తాజాగా ఆ చిత్రంలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్లకు ‘జైలర్’ బంగారు నాణేలను బహూకరించారు. అయితే, ఇందులో ప్రత్యేక గీతంలో నర్తించిన మిల్కీ బ్యూటీ తమన్నాకు ఎలాంటి బహుమతి ఇవ్వలేదని ప్రచారం సాగుతుంది. అదేవిధంగా హీరోయిన్గా నటించిన రమ్యకృష్ణన్ కు నిర్మాత బహుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం వారు అందుబాటులో లేక ఎటువంటి బహుమతి పంపలేదా? లేదంటే, కావాలనే వాళ్లని సైడ్ పెట్టేశారా? అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.