హాలీవుడ్ నటుడు అల్ పెచినో 83 ఏళ్ల వయసులో నాలుగోసారి డాడీ అని పిలిపించుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 83 ఏళ్ళ పాచినో, 29 ఏళ్ల నూర్ అల్ఫల్లాతో ప్రేమలో ఉన్నారు. కరోనా సమయం నుంచే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని సమాచారం. అయితే వీరిద్దరూ ప్రేమ, డేటింగ్ అంటూ తిరుగుతున్నారనే వార్తలు ఏప్రిల్, 2022లో బయటకు వచ్చాయి. ఈ క్రమంలో నూర్ గర్భం దాల్చినట్లు గత ఏడాది తెలిసింది. ఇప్పుడు ఆమెకు ఎనిమిది నెలలట. మరో నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం అల్ పచినో తండ్రి కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.