రక్షిత్ శెట్టి మరియు రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లో – ఎ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తెలుగు ప్రేక్షకుల కోసం విడుదల చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ సప్త సాగరాలు దాటి – సైడ్ ఎ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22, 2023న తెలుగు ప్రేక్షకుల ముందికి రావడానికి సిద్ధంగా ఉంది.
తాజాగా ఈరోజు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో ఈ సినిమా ప్రధాన నటీనటులు మరియు దర్శకుడు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ సందర్భంగా, రెండవ భాగం సప్త సాగరాలు ధాటి – సైడ్ బి తెలుగులో అక్టోబర్ 27, 2023న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కన్నడ వెర్షన్‌ను అక్టోబర్ 20, 2023న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో చైత్ర జె ఆచార్, అచ్యుత్ కుమార్ మరియు పవిత్ర లోకేష్ మరియు ఇతరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.