దుబాయ్ లో సైమా అవార్డ్స్ కి వెళ్లి వచ్చినప్పుడు ముంబై ఎయిర్ పోర్టులో నటి శృతి హాసన్ వెనకాల ఒక వ్యక్తి ఫాలో అవటం అందరూ వీడియోలో చూసారు. తరువాత ఈ వీడియో సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవటం కూడా జరిగింది. ఈ సంఘటన మీద శృతి హాసన్ స్పందిస్తూ.... నేను ఎయిర్ పోర్టులో నడిచి వెళుతున్నాను, అతను నా వెనకాలే నడుచుకుంటూ వస్తున్నాడు. అతనెవరో కూడా నాకు తెలియదు. అయితే అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ వున్నారు, అందులోంచి ఒకరు అతనికి కొంచెం దగ్గరగా వెళ్ళు అని చెప్పడంతో అతను నాకు మరీ దగ్గరగా వచ్చాడు. అయితే నేను ఆ ఫోటోగ్రాఫర్స్ లో ఒకరికి అతను తెలుసేమో అనుకున్నాను, కానీ అతను మరీ దగ్గరికి రావంతో నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను. నేను ఎప్పుడూ బాడీ గార్డ్స్ ని పెట్టుకోను, ఎందుకంటే నా వ్యక్తిగత జీవితాన్ని స్వేచ్ఛగా బతకాలని అనుకుంటూ వుంటాను, అందుకే నేను అంగ రక్షకులు లేకుండానే ఎక్కడికైనా వెళుతుంటాను, కానీ నా జాగ్రత్తల్లో నేనుంటాను," అని చెప్పింది శృతి హాసన్.